6, డిసెంబర్ 2012, గురువారం

4, డిసెంబర్ 2012, మంగళవారం

శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం వైకుంఠపురం తెనాలి




ఈదేవాలయం తెనాలి కి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్షేత్రంలో వేంకటేశ్వర స్వామి శ్రీలక్ష్మి పద్మావతి సహితంగా  కొలువుదీరి ఉన్నాడు. 
ఈ క్షేత్రంలో భూవరాహస్వామి, హనుమ, నాగేంద్రుడు ఉపాలయాలు ఉన్నాయి.
దేవాలయ ముఖమండపంలో శ్రీనివాసుని అవతార విశేషాలు తెలిపే చిత్రాలు గోడలపై నలుదిశల కడురమణీయంగా కొలువుదీరి ఉన్నాయి.

ఈ క్షేత్రంలో శ్రీలక్ష్మి పద్మావతి అర్ఛా మూర్తులు నిలబడి దర్శనమిస్తారు. 



















       

14, జులై 2012, శనివారం

శ్రీ అనంతాళ్వార్


శ్రీవారి కైంకర్యం లో తరించిన భక్తాగ్రేశ్వరుడు శ్రీ అనంతాళ్వార్. శ్రీ అనంతాళ్వార్ తిరుమల కొండ మీద  శ్రీవారి ఆలయానికి వెనక వైపు నివసించారు. ఈయన స్వామి వారికి రోజూ పూలమాలాలు సమర్పించేవారు. తిరుమల లో పూల తోటవేసి, ఆ తోట లోని పూలను మాలలుగా అల్లి రోజూ స్వామి వారికి సమర్పించేవారు.





అనంతాళ్వారులు  తిరుమల లో పూల తోటకి నీళ్ళ కోసం బావి తవ్వటానికి భార్యని సహకారం తీసుకొన్నారు. అనంతాళ్వారులు గునపంతో బావి తవ్వుతూ మట్టిని తట్టలో పోస్తే , ఆయన భార్య ఆ మట్టిని తట్టని తీసుకొని వెళ్ళి దూరంగా పోసి వచ్చేది.

అనంతాళ్వారులు కు సహాయం చెయ్యటానికి శ్రీనివాసుడు బాలుని రూపం లో వచ్చి,అనంతాళ్వార్ ని నేను మీకు సహాయం చేస్తాను అంటే  అనంతాళ్వారులు  అంగీకరించరు.

బాలుడు అనంతాళ్వారులు భార్య కి సహాయం చేస్తాను అంటే ఆమె అంగీకరిస్తుంది. ఆమె మట్టిని తట్టని తీసుకొనివెళ్ళి ఇస్తే, బాలుడు దూరంగా పోసివచ్చేవాడు. భార్య తొందర తొందరగా మట్టిని తట్టలు తీసుకొనివెళ్ళటానికి రావటం గ్రహించిన అనంతాళ్వారులు, భార్య  అడిగితే ఆమె బాలుడు సహాయం చేస్తున్నాడని చెప్తుంది.

ఆగ్రహించిన అనంతాళ్వారులు కోపంతో, చేతిలో ఉన్న గునపాన్ని బాలుని మీదకి విసురుతాడు. అది వెళ్ళి బాలుని గడ్డానికి  తగులుతుంది. ఆ బాలుడు అక్కడ నుంచి వెళ్ళిపోతే, అనంతాళ్వారులు మళ్ళీ బావి తవ్వే పనిలో నిమగ్నమౌతారు.

సాయంత్రం చక్కగా పూల మాలలు అల్లి బుట్టలో పెట్టుకొని శ్రీవారి ఆలయానికి వెళ్తాడు. అక్కడ శ్రీనివాసుని గడ్డానికి దెబ్బ తగిలి రక్తం రావటం  చూసిని అనంతాళ్వారులు, అయ్యో!!  నేను గునపం విసిరింది ఎవరిమీదకో కాదు. సాక్షాత్తు శ్రీనివాసుడే బావి తవ్వటంలో సహాయం చెయ్యటానికి వచ్చాడని గ్రహిస్తాడు. స్వామివారి గడ్డం పై పచ్చకర్పూరం అద్దుతాడు

అప్పటినుంచి  స్వామివారి గడ్డం పై రోజూ  పచ్చకర్పూరం అద్దుతారు.


ఇప్పటికీ మనం అనంతాళ్వారులు స్వామివారి మీద విసిరిన గునపాన్ని మహద్వారం దాటిన తర్వాత కుడి వైపు గోడకు వెళ్ళడుతూ ఉండటం చూడవచ్చు.
     
శ్రీ అనంతాళ్వార్ బృందావనం శ్రీవారి  ఆలయం వెనకవైపు ఉంటుంది. మనం  అనంతాళ్వార్ బృందావనం దర్శించవచ్చు.

శ్రీవారి  ఉత్సవ మూర్తి అయిన మలయప్పస్వామి సంవత్సరానికి ఒకసారి  శ్రీ అనంతాళ్వార్ బృందావనం కి వెళ్తారు.

శ్రీ అనంతాళ్వార్  శ్రీవారి కైంకర్యం లో తరించారు.



కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడువాడు

కుమ్మర దాసుడైన కురువరతినంబి
యిమ్మన్న వరములెల్ల నిచ్చినవాడు
దొమ్ములు సేసినయట్టి తొండమాం చక్కురవర్తి
రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు

అచ్చపు వేడుకతోడ ననంతాళువారికి
ముచ్చిలి వెట్టికి మన్ను మోచినవాడు
మచ్చిక దొలక దిరుమలనంబి తోడుత
నిచ్చనిచ్చ మాటలాడి నొచ్చినవాడు

కంచిలోన నుండ దిరుకచ్చినంబి మీద
కరుణించి తనయెడకు రప్పించిన వాడు
ఎంచి యెక్కుడైన వేంకటేశుడు మనలకు
మంచివాడై కరుణ బాలించినవాడు

 


శ్రీ అనంతాళ్వార్ బృందావనం

13, జులై 2012, శుక్రవారం

శ్రీజోగులాంబ ఆలయం ఆలంపూరు

శ్రీజోగులాంబ ఆలయం కర్నూలు కి 24 కిలోమీటర్ల దూరంలో ఉంది. అష్టాదశ శక్తి పీఠాలలో శ్రీజోగులాంబ ఆలయం కూడా ఒకటి. 


శ్రీజోగులాంబ అమ్మవారు ఉగ్రస్వరూపిణి.   శ్రీజోగులాంబ  అమ్మవారు ఆసీనురాలై,  శిరోజాలపై గబ్బిలం, బల్లి, తేలు మరియు కపాలం దర్శనమిస్తాయి.   అమ్మవారు ఉగ్రస్వరూపిణి కనుక కోనేరు పై ఆలయాన్ని నిర్మించారు.  కోనేరులో నీరు స్వచ్చంగా  ఉంది.


ఈక్షేత్రంలో పరమేశ్వరుడు బాల బ్రహ్మేశ్వర స్వామిగా కొలువుదీరి ఉన్నాడు.యిక్కడ నవ బ్రహ్మ ఆలయాలు ఉన్నాయి. అనేక ఉపాలయాలు కూడా ఉన్నాయి. 

14వ శతాబ్దంలో బహుమని సుల్థాన్స్  శ్రీజోగులాంబ   ఆలయాన్ని ధ్వంసం చేసారు. ఆప్పటినుంచి    శ్రీజోగులాంబ   అర్చా రూపాన్ని బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలోకి తరలించి అర్చిస్తున్నారు. 2005లో   శ్రీజోగులాంబ
ఆలయాన్ని పునరుద్దరించి మళ్ళీ  శ్రీజోగులాంబ   అర్చా రూపాన్ని పునఃప్రతిష్టించారు.


శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి మరియు శ్రీజోగులాంబ అమ్మవారి ఆలయాలు తుంగభద్రా నది ఒడ్డున ఉన్నాయి.  












                     

12, జులై 2012, గురువారం

శ్రీరాఘవేంద్ర స్వామి మంత్రాలయం

శ్రీరాఘవేంద్ర స్వామి బృందావనం మంత్రాలయంలో తుంగభద్రా నది ఒడ్డున ఉంది.  శ్రీరాఘవేంద్ర స్వామి  బృందావనం పక్కనే సుధీంద్రతీర్థ  బృందావనం  కూడా దర్శించవచ్చు.  శ్రీరాఘవేంద్ర స్వామి బృందావనంకి ఎదురుగా ఆంజనేయ స్వామి దర్శనమిస్తారు.    

శ్రీరాఘవేంద్ర స్వామి  అసలు పేరు వెంకటనాథుడు. శ్రీరాఘవేంద్ర స్వామి  బృందావనం దర్శించేముందు మంచాలమ్మ  అమ్మవారిని దర్శించాలి. మంచాలమ్మ  ఆలయం ఉదయం 6 గంటలకు తెరుస్తారు. శ్రీరాఘవేంద్ర స్వామి మఠానికి కొద్ది దూరంలో శ్రీరాఘవేంద్ర స్వామి పూజించిన వేంకటేశ్వర  స్వామి ఆలయాన్ని కూడా దర్శించవచ్చు.

వసతి సౌకర్యం కావాలంటే, మంత్రాలయం బస్సు స్టాండ్ నుంచి శ్రీరాఘవేంద్ర స్వామి  బృందావనానికి వెళ్ళే దారిలో CRO కార్యాలయం వస్తుంది. 10/- చెల్లించి లాకర్ సౌకర్యం కూడా పొందవచ్చు.  




మంచాలమ్మ  అమ్మవారి ఆలయద్వారం