30, జనవరి 2012, సోమవారం

శ్రీఅష్టభుజ పెరుమాళ్ ఆలయం కాంచీపురం


కాంచీపురంలో శ్రీమహావిష్ణువు శ్రీఅష్టభుజ పెరుమాళ్ గా కొలువుదీరి ఉన్నాడు. ఇక్కడ శ్రీఅష్టభుజ పెరుమాళ్ ఆదికేశవ పెరుమాళ్  అని కూడా ప్రతీతి.

శ్రీవైష్ణవులకు పరమపవిత్రమైన 108 దివ్యదేశాలలో,   శ్రీఅష్టభుజ పెరుమాళ్ ఆలయం కూడా ఒకటి

ఈ ఆలయం చాలా పురాతనమైనది. ఈ ఆలయంలో శ్రీమహావిష్ణువు   అష్ట భుజాలతో కొలువుదీరిఉన్నారు. కుడివైపున ఉన్న చతుర్భుజాలలో సుదర్శన చక్రం,  ఖడ్గం,  పుష్ఫం, బాణం ధరించి,  ఎడమవైపున ఉన్న చతుర్భుజాలలో      శంఖు, ధనస్సు , డాలు మరియు గధ  ధరించి నయనమనోహరంగా దర్శనమిస్తాడు. ఈ ఆలయంలో శ్రీమహాలక్ష్మి అలమేలుమంగగా కొలువుదీరి ఉంది.         

బ్రహ్మ దేవిని తపస్సుని భగ్నం చెయ్యటానికి సరస్వతీ దేవి రాక్షసులని పంపిస్తుంది. శ్రీమన్నారాయణుడు  సరస్వతీ దేవి పంపిన  రాక్షసులని సంహరిస్తాడు. కోపోద్రిక్తురాలైన  సరస్వతీ దేవి  సర్పాన్ని పంపిస్తుంది. శ్రీమన్నారాయణుడు  అష్టభుజాలతో, దివ్యాయుధాలు  ధరించి సర్పాన్ని కూడా సంహరించి బ్రహ్మ దేవిని తపస్సు నిర్విగ్నంగా కొనసాగేవిధంగా చేస్తాడు.  

ఈ ఆలయంలో శ్రీమన్నారయణుడు  సంహరించిన సర్ఫం యొక్క ఉపాలయన్ని కూడా దర్శించవచ్చు.   

ఈ ఆలయంలో కొలువుదీరిన  భూవరాహ, ఆండాళ్ మరియు హనుమని కూడా దర్శించవచ్చు. ఇక్కడ ఉన్న పుష్కరిణికి గజేంద్ర ఫుష్కరణి అని పేరు. ఈ ఆలయంలో లో వివిధ అకృతులలో  మలచిన శిల్పసంపద  కడు రమణీయం.  

ఇక్కడ  ఉన్న మరో విశేషం శ్రీఅష్టభుజ పెరుమాళ్  పరమపద ద్వారాలు నుంచి దర్శనమివ్వటం.      

27, జనవరి 2012, శుక్రవారం

శ్రీపార్థసారధి ఆలయం తిరువళ్ళికేన్


చెన్నైలో తిరువళ్ళికేన్ లో శ్రీమహావిష్ణువు శ్రీపార్థసారధి కొలువుదీరి ఉన్నాడు. చెన్నైలో ఉన్న పురాతన ఆలయాలలో శ్రీపార్థసారధి  ఆలయం విశిష్టమైనది.తిరువళ్ళికేన్ కే ట్రిప్లికేన్ అని  కూడా పేరు.     

ఈ ఆలయంలో కొలువుదీరిన  శ్రీపార్థసారధికే వేంకటకృష్ణ అని కూడా ప్రసిద్ధి.  పార్థసారధి అంటే అర్జునుని రధసారధి. శ్రీకృష్ణద్వైపాయనుడు శ్రీపార్థసారధి స్వామి అర్చారూపాన్ని, ఆత్రేయ మహర్షికి  యిస్తే,    ఆత్రేయ మహర్షి శ్రీపార్థసారధి స్వామి మూలవిరాట్టుని ప్రతిష్టించాడని ప్రతీతి.  ఈ ఆలయాన్ని పల్లవ రాజైన నరసింహవర్మన్  8వ శతాబ్ధంలో నిర్మించాడు.  ఈ ఆలయాన్ని చాళక్యులు, విజయనగర రాజులు విశేషంగా అభివృధ్ధి  చేసారు.          


శ్రీవైష్ణవులకు పరమపవిత్రమైన 108 దివ్యదేశాలలో శ్రీపార్థసారధి  ఆలయం కూడా ఒకటి


ఈ ఆలయంలో శ్రీపార్థసారధి మీసాలతో దర్శనమిస్తారు. ఈ ఆలయంలో శ్రీపార్థసారధి  రుక్మిణి, సాత్యకి, సోదరుడు బలరాముడు, కుమారుడు ప్రధ్యుమ్న, మనవడు అనిరుధ్ తో దర్శనమిస్తారు. 

పార్థసారధి స్వామి అర్చారూపం  ద్విబాహువులతో కుడి చేతిలో పాంచజన్యంతో, ఎడమ హస్తం వరదహస్తంగా, పద్మంపై ఉన్న తన  శ్రీపాదాలని  చూపిస్తూ ఉంటాడు. 


శ్రీమహాలక్ష్మి యిక్కడ ఉన్న పుష్కరిణిలో భోగ్యమైన లిల్లి పుష్పంలో వేదవల్లిగా  అవతరించి, భృగు మహర్షికి దొరికిందని ప్రతీతి.              

ఇక్కడ శ్రీమహావిష్ణువు నారసింహ, కోదండరామ, రంగనాధ, గజేంద్ర వరద మరియు వరాహ స్వామిగా కొలువుదీరి  ఉన్నదు.  అండాళ్, వేదవల్లి కూడా యిదే ఆలయంలో కొలువుదీరి ఉన్నారు.                         

ఈ ఆలయంలో శ్రీపార్థసారధి స్వామి ఉత్సవమూర్తి వదనంపై శరాఘాతం గుర్తులు ఉంటాయి. కురుక్షేత్ర సంగ్రామంలో  శ్రీకృష్ణ పరమాత్మ పార్థుని రధసారధిగా ఉన్నప్పుడు, భీష్మాచార్యులు శరాఘాతాలతో శ్రీకృష్ణ పరమాత్మ వదనంపై గాయాలు చేస్తారు.  శ్రీపార్థసారధి ఉత్సవమూర్తి రుక్మిణి సత్యభామా సహితంగా కొలువుదీరి ఉన్నారు.     


తిరువళ్ళికేన్ లో కొలువుదీరిన శ్రీపార్థసారధి స్వామి వారికి బ్రహోత్సవం మరియు వైకుంఠ ఏకాదశి  విశేషంగా జరుగుతుంది. 


ఈ ఆలయంలో శ్రీపార్థసారధి స్వామిని అత్యంత భక్తిప్రపత్తులతో    కేశవాచార్య మరియు కాంతిమతి సేవించి , భగవత్ రామానుజులుని కుమారునిగా పొందారు.
                     









హరివిహముగ్ధవ ధూని కరే విలాసిని విలసతి కేళిపరే 


చందన చర్చిత నీల కళేబర పీత వతన వనమాలీ 
చందన చర్చిత నీల కళేబర పీత వతన వనమాలీ 
కేళి చలన్మని కుండల మండిత గండయు గస్మిత శాలీ 
హరివిహముగ్దవ ధూని కరే విలాసిని విలసతి కేలిపరే 
కాపి విలాసవి లోల విలోచన కేలన జనిత మనోజం 
కాపి విలాసవి లోల విలోచన కేలన జనిత మనోజం 
ధ్యయతి ముగ్ధవ బురవిభకం మధు సూధన వదన సరోజం 
ధ్యయతి ముగ్ధవ బురవిభకం మధు సూధన వదన సరోజం 
హరివిహముఘ్ధవ ధూని కరే విలాసిని విలసతి కేలిపరే 
ఇష్యతి కామపి చుంబతి కామపి రమయతి కమాపి రామ 
సథ్యతి సస్మిత చారుతరాం అపరామను గస్యతి రామ 
హరివిహముఘ్ధవ ధూని కరే విలాసిని విలసతి కేలిపరే 

26, జనవరి 2012, గురువారం

శ్రీఉలగళంద పెరుమాళ్ ఆలయం కాంచీపురం


కాంచీపురంలో శ్రీమహావిష్ణువు కొలువుదీరిన సుప్రసిద్ధ ఆలయాలలో  శ్రీఉలగళంద పెరుమాళ్ ఆలయానికి విశిష్ట స్థానం ఉందిశ్రీమహావిష్ణువు శ్రీఉలగళంద పెరుమాళ్ గా కొలువుదీరి ఉన్నాడు ఆలయం శ్రీ కామాక్షి దేవి ఆలయానికి  సమీపంలో ఉంటుంది.

శ్రీఉలగళంద పెరుమాళ్ త్రివిక్రముడు మరియు వామనుడు అని కూడా ప్రసిద్ధివామనవతారం శ్రీమహావిష్ణువు యొక్క ఐదవ అవతారం. ఇక్కడ  ఆదిశేషునికి  మరియు బలి చక్రవర్తికి శ్రీఉలగళంద పెరుమాళ్  దర్శనమిచ్చారుబలిచక్రవర్తి పరమ విష్ణుభక్తుడు.


శ్రీఉలగళంద పెరుమాళ్ అర్చారూపం  చాలా పెద్దగా 35 అడుగుల ఎత్తుతో ఉంటుందిశ్రీఉలగళంద పెరుమాళ్ ని చూడటానికి రెండు కనులు  సరిపోవు ఆలయంలో శ్రీఉలగళంద పెరుమాళ్   అమృతవల్లి సహితంగా కొలువుదీరి ఉన్నారు. ఇక్కడ ఉన్న పుష్కరిణి నాగ తీర్థం. శ్రీఉలగళంద పెరుమాళ్  ఎడమ పాదం ఆకాశంపై ఉంటుంది. కుడి పాదం బలిచక్రవర్తి తలపై ఉంటుంది. శ్రీఉలగళంద పెరుమాళ్  ద్విబాహువులతో దర్శనమిస్తారు.  రెండు చేతుల కుడి ఎడమలకు చాచి, కుడి చేతి ఒక వేలు, ఎడమ చేతి రెండు వేళ్ళు చూపిస్తూ ఉంటారు.                 




శ్రీవైష్ణవులకు పరమపవిత్రమైన 108 దివ్యదేశాలలోశ్రీవరదరాజ పెరుమాళ్ ఆలయం కూడా ఒకటిఈ ఆలయంలో వామన జయంతి విశేషంగా నిర్వహిస్తారు.

ప్రహ్లాదుని మనవడైన  బలిచక్రవర్తికి దానగుణం పెట్టని అలంకారంబలిచక్రవర్తి పాతాళలోకం పరిపాలిస్తూదేవతలతో యుద్ధం చేసి,  దేవేంద్రుడిని పదవీచ్యుడిని చేసిస్వర్గంపై ధిపత్యం సాధిస్తాడుబలిచక్రవర్తిఅసుర గురువు శుక్రాచార్యుడు సహకారంతో అశ్వమేధయాగం  చేసి ముల్లోకాలపై ఆధిపత్యం సాధించటానికి సిద్ధపడతాడు.


బలిచక్రవర్తి ప్రయత్నానికి ఆటంకం కలిగించటానికి  శ్రీమహావిష్ణువు  వామనుడుగా అవతరించి, బలిచక్రవర్తికి దగ్గరికి వెళ్ళి మూడు అడుగుల నేల దానం అడుగుతాడు.


" నృప!! నీ దానగుణం విని మీదు మిక్కిలి సంతసించానునేను అడిగినది దానం యివ్వగలవా? " అని ఠీవిగా నిలబడి ఉన్న వామనుడు బలిచక్రవర్తిని అడుగుతాడు.  
"ఏమి దానంగా కావాలో  కోరుకో!!" దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న వామనుడుతో బలి అంటాడు.
"నాకు మూడు అడుగుల స్థలం యివ్వగలవా?"  అని వామనుడు అడుగుతాడు.
"అదెంత భాగ్యం!! ఇప్పుడే తీసుకోఅని బలి జల పూర్వకంగా వామనుడుకి దానమివ్వ తలుస్తాడు.
శ్రీమహావిష్ణువు  వామనుడు రూపంలో బలి నుంచి దానం స్వీకరించటానికి  వచ్చాడని గ్రహించిన  అసుర గురువు శుక్రాచార్యుడుబలిని దానం యివ్వవద్దని కోరతాడు.
       
వారిజాక్షులందువైవాహికములందు
బ్రాణ విత్త మాన భంగములందుఁ
జకితగోకులా గ్రజన్మరక్షణమందు
బొంకవచ్చునఘము రాదధిప!

"గురు వర్యా!!  దానం యిస్తాను అని వాగ్ధనం చేసిన తర్వాత ఆడితప్పటం సరి కాదు.  శ్రీమహావిష్ణువే స్వయంగా వామనుడి రూపంలో దానం స్వీకరించటానికి  వస్తే మిక్కిలి సంతసిస్తాను" అని బలిచక్రవర్తి శుక్రాచార్యునితో పలికి, జలసహితంగా 3 అడుగుల నేల దానం చెయ్యటానికి సిద్దపడి జల పాత్రను కరములలోకి  తీసుకొంటాడు.

కీడు శంకించిన శుక్రాచార్యులు కందిరీగ రూపందాల్చి జలం పాత్రలోనుంచి జలం బయటకు రాకుండా అడ్డుగా ఉంటాడుఇది గ్రహించిన వామనుడు పుల్లతో జలపాత్రలో అడ్డుగా ఉన్న కందిరీగని పొడుస్తాడు పుల్ల కందిరీగ రూపంలో ఉన్న శుక్రాచార్యులు ఒక కన్నుకి తగిలి దృష్టి పోతుందిబలిచక్రవర్తి జల సహితంగా 3 అడుగుల భూమి  వామనుడుకి దానం యిస్తాడు.


ఇంతింతై వటుడింతయై మరియు తానింతై నభో వీధి పై
నంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభా రాశి పై
నంతై చంద్రుని కంతయై ధ్రువుని పై నంతై మహర్వాటి పై
నంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధి యై !!


వామనుడు  త్రివిక్రముడై ముల్లోకాలు ఆక్రమించేటంతగా ఎదిగిపోయాడుఒక అడుగుతో భూమినిమరో అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించిమూడో అడుగు పెట్టటానికి స్థలం చూపమని వామనుడు  బలిచక్రవర్తిని కోరతాడుబలిచక్రవర్తి మూడో అడుగు తన తలపై పెట్టమని కోరతాడుత్రివిక్రముడు మూడో అడుగు  బలిచక్రవర్తి తలపై మోపి బలిని పాతళలోకానికి తొక్కేస్తాడు.

బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మము తానెని పాదము

చెలగి వసుధ కొలిచిన నీ పాదము
బలి తల మోపిన పాదము
తలకగ గగనము తన్నిన పాదము
బలరిపు గాచిన పాదము
కామిని పాపము కడిగిన పాదము
పాము తలనిడిన పాదము
ప్రేమతొ శ్రీ సతి పిసికెడి పాదము
పామిడి తురగపు పాదము

పరమ యోగులకు పరి పరి విధముల
పరమొసగెడి నీ పాదము
తిరువేంకటగిరి తిరమని చూపిన
పరమ పదము నీ పాదము
                  

25, జనవరి 2012, బుధవారం

శ్రీవరదరాజ పెరుమాళ్ ఆలయం కాంచీపురం


కాంచీపురంలో శ్రీమహావిష్ణువు కొలువుదీరిన సుప్రసిద్ధ ఆలయాలలో  శ్రీవరదరాజ పెరుమాళ్ ఆలయానికి విశిష్ట స్థానం ఉంది. ఈ ఆలయం దేవరాజ  పెరుమాళ్  ఆలయం అని కూడా ప్రసిద్ధి.  శ్రీవరదరాజ పెరుమాళ్ ఆలయాన్ని చోళ రాజులు నిర్మించారు.   ఆలయాన్ని చోళ రాజులైన కుళోత్తుంగ చోళ మరియు విక్రమ చోళ కాలంలో విశేషంగా అభివృధ్ధి చేశారు.     
     


శ్రీవైష్ణవులకు పరమపవిత్రమైన 108 దివ్యదేశాలలో, శ్రీవరదరాజ పెరుమాళ్ ఆలయం కూడా ఒకటి. పన్నిద్దరు  ఆళ్వార్లు అయిన పొయ్గై ఆళ్వార్,  పూదత్తాళ్వార్, పేయాళ్వార్, పెరియాళ్వార్, తిరుమళిశై  ఆళ్వార్, కులశేఖరాళ్వార్తిరుప్పాణాళ్వార్, తొండరడిప్పొడియాళ్వార్, తిరుమంగయాళ్వార్, మధురకవియాళ్వార్, ఆండాళ్, నమ్మాళ్వారులు శ్రీవరదరాజ పెరుమాళ్ ఆలయాన్ని సందర్శించారని ప్రతీతి.

ఆలయంలో భగవద్ రామానుజులు  కొంతకాలం నివశించారని  ప్రతీతి. ఆలయంలో  శ్రీవరదరాజ పెరుమాళ్ పేరుందేవి తాయారు సహితంగా కొలువుదీరి ఉన్నారు.

శ్రీవరదరాజ పెరుమాళ్  ఆలయానికే హస్తిగిరి (హస్తి అంటే ఏనుగు, గిరి అంటే కొండ)  అని కూడా పేరు. శ్రీవరదరాజ పెరుమాళ్  ఆలయం హస్తిగిరిపై నిర్మించారు. ఆలయంలో శ్రీవరదరాజ పెరుమాళ్  అర్చామూర్తి  పశ్చిమ దిక్కుకు  నిలబడి ఉంటాడు.  శ్రీవరదరాజ పెరుమాళ్ చతుర్భుజాలతో శంఖచక్రాలుగధ ధరించి అభయ హస్తంతో నయనానందకరంగా దర్శనమిస్తారు.  ఇక్కడ శ్రీమహాలక్ష్మి  పేరుందేవి తాయారుగా కొలువుదీరి ఉంది. పేరుందేవి తాయారుకి మహాదేవి అని కూడా పేరు.  




కృతయుగంలో చతుర్ముఖ బ్రహ్మ  ,త్రేతాయుగంలో  గజేంద్రుడు , ద్వాపరయుగంలో  దేవగురువు బృహస్పతి, కలియుగంలో ఆదిశేషుడు  శ్రీవరదరాజ పెరుమాళ్ ని సేవించారని ప్రతీతి.  

ఆలయంలో కృష్ణ, రామ, వరాహ స్వామి, కరియమాణిక్య పెరుమాళ్, ఆండాళ్, ఆళ్వార్ల  కొలువుదీరి ఉన్నారు

ఇక్కడ ఉన్న మరో  విశేషం  ఆలయ పైకప్పు పై  పీఠంపై సుందరంగా మలచిన బంగారు బల్లి మరియు వెండి బల్లి ఆకర్షణీయంగా ఉంటాయి బల్లులని స్ఫృశిస్తే పాపాలు తొలగి పోతాయని ప్రతీతి.   బల్లుల పక్కనే వేరే పీఠంపై ఉన్న సూర్య, చంద్రుల రూపాలు ఆకర్షణీయంగా ఉంటాయి.
       
శ్రీవరదరాజ పెరుమాళ్ ఆలయంలో నూరు  కాళ్ళ  మండపలో స్థంభాలపై కొలుదీరిన వివిధ రూపాలలో మలచిన విగ్రహాలు కడు రమణీయంగా ఉంటాయి. ఇక్కడ  ఏకశిలతో చెక్కిన రాతి గొలుసులు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

చూస్తే భోగ్యమైన కంచి వరదుని గరుడ సేవ చూడాలి అనేటట్లు  శ్రీవరదరాజ పెరుమాళ్ కి గరుడసేవ విశేషంగా జరుగుతుంది. బ్రహ్మోత్సవాలు వైశాఖ మాసంలో జరుగుతాయిగరుఢారూడుడై  శంకచక్రధారియై, అభయ వరద హస్తాలతో కంచి వరదుడు గరుడసేవ అంగరంగ వైభవంగా జరుగుతుంది.     




శ్రీవరదరాజ పెరుమాళ్  గరుడారూఢుడై పుర వీధులలో ఊరేగుతారు. ఇక్కడ శ్రీవరదరాజ పెరుమాళ్  స్వామి   గరుడసేవలో అర్చకులు   కొద్ది విఘడియలు  స్వామి వారి ఉత్సవ మూర్తికి శ్వేత  ఛత్రాలు అడ్డుగా పెడతారు. దొడ్డయాచార్య అనే భక్తుడు షోలింగూర్ నివసించేవాడుదొడ్డయాచార్య ప్రతి సంవత్సరం కంచి వరదుని గరుడసేవ చూడటానికి వచ్చేవాడు. వయోవృధ్ధుడై అనారోగ్యంతో ఉన్న దొడ్డయాచార్య కంచి వరదుని గరుడ సేవ దర్శనానికి రాలేకపోయి, షోలింగూర్ లోనే ఉండి, కంచి వరదుని గరుడ సేవ దర్శించే భాగ్యం లేదు అని బాధపడతాడు. భక్తుల పాలి కల్పతరువైన కంచి వరదుడు తన ప్రియ భక్తుడికి దర్శనం యివ్వాలని తలచి, అర్చకులకు తనకు కొద్ది విఘడియలు శ్వేత  ఛత్రాలు అడ్డుగా పెట్టమని చెప్పిశ్రీవరదరాజ పెరుమాళ్  గరుడాళ్వార్ తో అదృశ్యమై షోలింగూర్లో దొడ్డయాచార్యకు దర్శనమిస్తారు. అప్పటినుంచి కంచి వరదుని గరుడసేవలో అర్చకులు వరదునికి కొద్ది విఘడియలు శ్వేత  ఛత్రాలు అడ్డుగా పెడతారు అని ప్రతీతి








శ్రీవరదరాజ పెరుమాళ్ అర్చారూపం  అత్తి కలపతో మలిచారని ప్రతీతి. అయితే శ్రీవరదరాజ పెరుమాళ్ అర్చారూపాన్ని ఆలయ ప్రాంగణంలో ఉన్న కోనేరు నుంచి, ప్రతి 40 సంవత్సరాలకొకసారి కోనేరులో నుంచి  తీసి 10 రోజులు దర్శనానికి అనుమతిస్తారు.     1979 సంవత్సరంలో అత్తి శ్రీవరదరాజ పెరుమాళును కోనేరు నుంచి బయటకి తీసి దర్శనానికి అనుమతించారు.ళ్ళీ 2019 సంవత్సరంలోనే  అత్తి శ్రీవరదరాజ పెరుమాళును దర్శించగలం .