14, ఏప్రిల్ 2013, ఆదివారం

శ్రీరంగనాధస్వామి ఆలయం శ్రీరంగపట్టణం



శ్రీరంగనాధస్వామి శ్రీరంగపట్టణం లో, మాండ్య జిల్లా లో కర్ణాటక రాష్ట్రంలో కొలువుదీరి ఉన్నాడు. ఈక్షేత్రం పంచ రంగ క్షేత్రాలలో మొదటి క్షేత్రంగా విరాజిల్లుటుంది.   ఈక్షేత్రానికే ఆది రంగ క్షేత్రం అని కూడా పేరు. 

ఈ దివ్యక్షేత్రం కావేరి నది మధ్యలో ఉన్నది.  పంచ రంగక్షేత్రాలు అన్నీ కావేరి నది ఒడ్డునే ఉన్నాయి. 
         

ఈ క్షేత్రంలో మహాలక్ష్మి  రంగనాయకిగా కొలువై ఉంది.ఇంకా ఈ క్షేత్రంలో నరసింహ, సుదర్శన , గోపాలకృష్ణ,      శ్రీనివాస, రామ మరియు పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాలయాలు కూడా  ఉన్నాయి.






















   








9, ఏప్రిల్ 2013, మంగళవారం

శ్రీవారి తెప్పోత్సవాలు తిరుమల

 
 
శ్ర్రీవారి వార్షిక తెప్పోత్సవాలు ప్రతి సంవత్సరమొ ఫాల్గునమాసం శుద్ద ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు సాయంసంధ్య వేళ శ్రీమలయప్పస్వామి భూదేవి శ్రీదేవి సమేతుడై తిరుమల పుష్కరిణిలో విహరిస్త్తారు. ఈ తెప్పోత్సవాలు జరిగే రోజుల్లో వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ, పున్నమి గరుడసేవని రద్దు చేస్తారు. పుష్కరిణి మెట్లపై కూర్చుని     తెప్పోత్సవాలు వీక్షించటానికి భక్తులని అనుమతిస్తారు.
 
 
శ్రీమలయప్పస్వామి భూదేవి శ్రీదేవి సమేతుడై ఏకాదశి నుంచి చతుర్ధశి వరకు, ప్రతిరోజు  పుష్కరిణిలో 5సార్లు తెప్పపై విహరిస్తారు.   తెప్పోత్సవాల ఆఖరి రోజైన  పౌర్ణమి  రోజున  95సార్లు తెప్పపై విహరిస్తారు. విధ్యుత్ దీపకాంతుల నడుమ భక్తుల గోవింద నామస్మరణతో, అన్నమాచార్య కీర్తనలతో కడురమణీయంగా  తెప్పోత్సవాలు జరుగుతాయి.