తీర్థయాత్ర లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
తీర్థయాత్ర లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, ఏప్రిల్ 2013, ఆదివారం

శ్రీరంగనాధస్వామి ఆలయం శ్రీరంగపట్టణం



శ్రీరంగనాధస్వామి శ్రీరంగపట్టణం లో, మాండ్య జిల్లా లో కర్ణాటక రాష్ట్రంలో కొలువుదీరి ఉన్నాడు. ఈక్షేత్రం పంచ రంగ క్షేత్రాలలో మొదటి క్షేత్రంగా విరాజిల్లుటుంది.   ఈక్షేత్రానికే ఆది రంగ క్షేత్రం అని కూడా పేరు. 

ఈ దివ్యక్షేత్రం కావేరి నది మధ్యలో ఉన్నది.  పంచ రంగక్షేత్రాలు అన్నీ కావేరి నది ఒడ్డునే ఉన్నాయి. 
         

ఈ క్షేత్రంలో మహాలక్ష్మి  రంగనాయకిగా కొలువై ఉంది.ఇంకా ఈ క్షేత్రంలో నరసింహ, సుదర్శన , గోపాలకృష్ణ,      శ్రీనివాస, రామ మరియు పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాలయాలు కూడా  ఉన్నాయి.






















   








4, డిసెంబర్ 2012, మంగళవారం

శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం వైకుంఠపురం తెనాలి




ఈదేవాలయం తెనాలి కి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్షేత్రంలో వేంకటేశ్వర స్వామి శ్రీలక్ష్మి పద్మావతి సహితంగా  కొలువుదీరి ఉన్నాడు. 
ఈ క్షేత్రంలో భూవరాహస్వామి, హనుమ, నాగేంద్రుడు ఉపాలయాలు ఉన్నాయి.
దేవాలయ ముఖమండపంలో శ్రీనివాసుని అవతార విశేషాలు తెలిపే చిత్రాలు గోడలపై నలుదిశల కడురమణీయంగా కొలువుదీరి ఉన్నాయి.

ఈ క్షేత్రంలో శ్రీలక్ష్మి పద్మావతి అర్ఛా మూర్తులు నిలబడి దర్శనమిస్తారు.