తీర్థాలు తిరుమల లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
తీర్థాలు తిరుమల లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

16, జనవరి 2012, సోమవారం

పాపనాశనం తిరుమల



తిరుమల నంబి పాపనాశనం నుంచి తెచ్చిజలము తో  శ్రీవేంకటేశ్వర స్వామి వారి అర్చా మూర్తికి అభిషేకం నిర్వహించేవారు.  వయోవృధ్ధుడైన తిరుమల నంబి చాలా దూరము నుంచి  అలా కుండలో పాపనాశనం జలము తెస్తుంటే, శ్రీవేంకటేశ్వర స్వామి కలతచెంది, ఒకరోజు ఒక బాలుడు రూపంలో , తాతా!! అని తిరుమల నంబి  ని పిలిచి , దాహంగా ఉంది కుండలో  ఉన్న జలం యివ్వమని  కోరుతాడు.

అప్పుడు  తిరుమల నంబి  ఈ జలం శ్రీవేంకటేశ్వర స్వామి అభిషేకానికి తీసుకొని వెళ్తున్నాను అని యివ్వటానికి నిరాకరిస్తాడు. బాలుడు రాయిని విసిరితే, కుండకు రంధ్రంపడి జలధార వస్తుంది. బాలుడు ఆ జలధార త్రాగి దాహం తీర్చుకొంటాడు.. 

" ఎంతపని చేసావు. స్వామివారి అభిషేకానికి తీసుకొనివెళ్తున్న జలం అంతా  త్రాగేసావు"  అని తిరుమల నంబి  బాలుని తో అంటాడు.


" తాతా!! యిక్కడే ఆకాశగంగ ఉంది రా!! చూపిస్తాను. ఈరోజు నుంచి నాకు ఆకాశగంగ జలంతో అభిషేకం చెయ్యి"   అని దగ్గరగా ఉన్నఆకాశగంగను  తిరుమల నంబికి చూపించి  బాలుడు  అదృశ్యం అవుతాడు. 


" ఈ రోజు నేను కడుపు నిండా నీరు త్రాగాను. నా కడుపు చల్లగా ఉంది. ఈ రోజు నాకు అభిషేకం వద్దు"  అని శ్రీవేంకటేశ్వర స్వామి అర్చకులను ఆవహించి అని చెప్తారు.


" అభిషేకం కోసం నీరు తేసుకొని వస్తుంటే బాలుడు అన్ని  త్రాగేసాడు. ఈ రోజు అభిషేకం  చెయ్యటానికి నీరు లేదు.అభిషేకం  చెయ్యటాం ఎలా ?"  అని బెంగపడుతున్న తిరుమల నంబి శ్రీవేంకటేశ్వర స్వామి  ఆలయం లోకి  వస్తాడు. 


అక్కడ అర్చకులు చెప్పింది విని " శ్రీస్వామియే బాలుని రూపంలో  వచ్చి కుండలో నీరు త్రాగి, అభిషేకాన్ని  ఆకాశగంగా జలం తో చెయ్యమని చెప్పాడు"  అని  తిరుమల నంబి  చాలా సంతోషిస్తాడు 
    
అప్పటి నుంచి ఆకాశగంగ  జలం తో స్వామివారికి అభిషేకం  నిర్వహిస్తున్నారు.


అప్పటి నుంచి తిరుమల నంబి " తాతాచార్యుడు"  గా  కూడ పిలవబడ్డారు. 

పాపనాశనంలో దేవస్థానం వారు ఏర్పాటుచేసిన కృత్రిమ పాపనాశనం జలధార కింద స్నానం చెయ్యవచ్చు.

పాపనాశనం బస్ లో వెళ్ళవచ్చు.
 
 

13, జనవరి 2012, శుక్రవారం

ఆకాశగంగ తిరుమల



తిరుమల లో ఉన్న పవిత్ర పుణ్యతీర్థాలలో  ఆకాశగంగ  విశిష్టమైనది. శ్రీవేంకటేశ్వర స్వామి వారి అర్చా మూర్తికి  ఈ పుణ్య జలంతోనే అభిషేకం జరుపుతారు.


శ్రీవేంకటేశ్వర స్వామి వారే ఈ ఆకాశగంగ ను తిరుమల నంబికి చూపించి,  ఇప్పటినుంచి ఈ జలముతోనే అభిషేకం జరపమని చెప్పాడు. అప్పటివరకూ పాపనాశనం జలము తో అభిషేకం జరిపేవారు.


శ్రీవేంకటేశ్వర స్వామి కోరికమేరకు అప్పటినుంచి ఆకాశగంగా జలంతోనే స్వామి వారికి అభిషేకం నిర్వహిస్తున్నారు. 

అప్పటినుంచి తిరుమల నంబి కుటుంబీకులు శ్రీవారి అభిషేకానికి ఆకాశగంగా జలం బిందెలు తల పై పెట్టుకొని ధవళ వర్ణ ఛత్రాలతో కూడి తిరుమల ఆలయానికి తీసుకొనివస్తారు.

ఆకాశగంగా జలం స్వచ్ఛంగా ఉంటుంది.

ఆకాశగంగ కు వెళ్ళటానికి బస్ లు ఉన్నాయి. 



12, జనవరి 2012, గురువారం

జాపాలి తీర్థం తిరుమల


ఇక్కడ  జాపాలి ముని తపస్సు చేసాడు అందుకే ఆ ముని పేరు మీద ఇక్కడ ఉన్న తీర్థం జాపాలి తీర్థం అని పిలుస్తారు అని ప్రతీతి. ఇక్కడే అంజనా దేవి తపస్సు చేసుకొనేది అని కూడా  చెప్తారు.
 
జాపాలి హనుమాన్ ఆలయం జాపాలి తీర్థం దగ్గర ఉన్నది. ఈ జాపాలి హనుమాన్ ఆలయం  హధీరాం మఠం చే నిర్వహించబడుతుంది.

జాపాలి తీర్థం వెళ్ళాలంటే మెట్ల మార్గం నుంచి 1 కిలోమీటర్ అయినా నడిచి    వెళ్ళాలి.  

తిరుమల నుంచి జాపాలి తీర్థం కి బస్ లో వెళ్ళవచ్చు. బస్ దిగిన తర్వాత 1 కిలోమీటర్ అయినా నడిచి    వెళ్ళాలి.