30, జూన్ 2012, శనివారం

శ్రీ ఉమామహేశ్వర ఆలయం యాగంటి




యాగంటి క్షేత్రం బనగానపల్లె కి 14 కిలోమీటర్ల దూరంలో కర్నూలు జిల్లాలో ఉంది. 

యాగంటి క్షేత్రంలో  పరమేశ్వరుడు పార్వతి సహితంగా ఉమామహేశ్వరుడుగా కొలువుదీరి ఉన్నాడు. ఇక్కడ ఉమామహేశ్వరులు ఏకశిలపై  నయన మనోహరంగా   కొలువుదీరి ఉన్నారు.  

ఈ  క్షేత్రంలో  నందీశ్వరుని విగ్రహం పెద్దగా ఉంది. ఈ  నందీశ్వరుని విగ్రహం  పెరిగే శిలతో మలిచారు అని ప్రతీతి అందుకే నందీశ్వరుని  రూపం ప్రతిష్టించినప్పటినుంచి పెరుగుతూ  ఉంది.  

అగస్థ్య కోనేరులో  నీరు చాలా స్వచ్చంగా  జలపుష్పాలతో నిర్మలంగా ఉంది. 

అగస్థ్య  మహర్షి ప్రతిస్టించిన  శివలింగం మరియు తపస్సుచేసిన ప్రదేశం అగస్థ్య  గుహలో  చూడవచ్చు.  అగస్థ్య  గుహలోలో కి వెళ్ళి దర్సనం చేసుకోవటానికి మెట్లు ఉన్నాయి.  ఈ మెట్లు  ఎక్కటానికి కొంచెం కష్టంగా ఉన్నాయి. 

ప్రక్కనే ఉన్న మరో గుహలో   శ్రీవేంకటేశ్వరస్వామిని కూడా దర్సించుకోవచ్చు.
    








1, మే 2012, మంగళవారం

పద్మావతీదేవి పరిణయోత్సవాలు తిరుమల



తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో  పద్మావతీదేవి పరిణయోత్సవాలు ప్రారంభమయ్యాయి. పద్మావతీదేవిని శ్రీనివాసుడు మొదటిసారిగా ఉద్యానవనంలో చూసాడని, అందుకు ప్రతీకగా పద్మావతీదేవి వార్షిక పరిణయోత్సవాలు, ఉద్యానవనంలో నిర్వహిస్తారు.


ఈ ఉత్సవాలలో శ్రీనివాసుడు అశ్వ, గజ, గరుడ వాహనాల మీద దర్శనమిస్తారు. 


ఈ ఉత్సవాలు వైశాఖ శుద్ధ నవమి నుంచి వైశాఖ శుద్ధ ఏకాదశి వరకు సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుంచి  8 గంటల వరకు నిర్వహిస్తారు.


 



29, ఏప్రిల్ 2012, ఆదివారం

తోమని పళ్ళాల వాడే వేంకటేసుడు


వేడుకుందామా వేంకటగిరి వేంకటేశ్వరుని ||

ఆపద మ్రొక్కుల వాడే ఆది దేవుడే వాడు
తోమని పళ్యాల వాడే దురిత దూరుడే ||

వడ్డి కాసుల వాడే వనజ నాభుడే
పుట్టు  గొడ్రాండ్రకు బిడ్డలిచ్చే గోవిందుడే ||

ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే
వాడు, అలమేల్మంగా వేంకటాద్రి నాథుడే ||
   
తిరుమలలో కొత్త కుండని పగలగొట్టి, ఆ కుండ పెంకులో, ప్రతిరోజు మధ్యాహ్నం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామి కి ప్రసాదం నివేదిస్తారు. కుమ్మర దాసుడైన కురువరత్తి నంబి భక్తికి శ్రీనివాసుడు ముగ్ధుడై, అతను కుండ పెంకులో నివేదించిన ప్రసాదాన్ని  స్వీకరిస్తాడు. 

అందుకే తిరుమలలో కుండ పెంకులో ప్రతిరోజు మధ్యాహ్నం స్వామివారికి ప్రసాదం నివేదిస్తారు.

అందుకే అన్నమాచార్యులు కీర్తనలో తోమని పళ్యాల వాడే అని కీర్తించారు.