8, జులై 2012, ఆదివారం

శ్రీనారసింహ స్వామి అహోబిలం


శ్రీమహావిష్ణువు శ్రీనారసింహ స్వామిగా అహోబిలంలో కొలువుతీరి ఉన్నారు.
శ్రీవైష్ణవులకు పరమపవిత్రమైన 108 దివ్యదేశాలలో,  శ్రీనారసింహ స్వామిగా ఆలయం కూడా ఒకటి. 

అహోబిలంలో నవనారసింహ క్షేత్రాలులో శ్రీమహావిష్ణువు  కొలువుతీరి ఉన్నారు.భార్గవ, యోగానంద, ఛత్రవాత, ఉగ్ర, వరాహ , మాలోల ,  జ్వాల,  పావన, కారంజి క్షేత్రాలే నవనారసింహ క్షేత్రాలు. ఆళ్ళగడ్డ నుంచి అహోబిలం వెళ్ళవచ్చు.

ఎగువ అహోబిలంలో శ్రీమహావిష్ణువు ప్రహ్లాదవరదుడై హిరణ్యాక్షుడిని సంహరించటానికి  శ్రీనారసింహ స్వామిగా ఇక్కడే అవతరించి  దర్శనమిచ్చారని ప్రతీతి.



ఇందు గలడందు లేడని
సందేహము వలదు చక్రి సర్వోపగతుం
డెందెందు వెదకి జూచిన
అందందే గలడు దానవాగ్రణి వింటే !!

కమలాక్షు నర్చించు కరములు కరములు
     శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ
సుర రక్షకుని జూచు చూడ్కులు చూడ్కులు
     శేషశాయికి మ్రొక్కు శిరము శిరము
విష్ణు నాకర్ణించు వీనులు వీనులు
     మధువైరి దవిలిన మనము మనము
భగవంతు వలగొను పదములు పదములు
     పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి



   







4 కామెంట్‌లు: