27, జనవరి 2012, శుక్రవారం

శ్రీపార్థసారధి ఆలయం తిరువళ్ళికేన్


చెన్నైలో తిరువళ్ళికేన్ లో శ్రీమహావిష్ణువు శ్రీపార్థసారధి కొలువుదీరి ఉన్నాడు. చెన్నైలో ఉన్న పురాతన ఆలయాలలో శ్రీపార్థసారధి  ఆలయం విశిష్టమైనది.తిరువళ్ళికేన్ కే ట్రిప్లికేన్ అని  కూడా పేరు.     

ఈ ఆలయంలో కొలువుదీరిన  శ్రీపార్థసారధికే వేంకటకృష్ణ అని కూడా ప్రసిద్ధి.  పార్థసారధి అంటే అర్జునుని రధసారధి. శ్రీకృష్ణద్వైపాయనుడు శ్రీపార్థసారధి స్వామి అర్చారూపాన్ని, ఆత్రేయ మహర్షికి  యిస్తే,    ఆత్రేయ మహర్షి శ్రీపార్థసారధి స్వామి మూలవిరాట్టుని ప్రతిష్టించాడని ప్రతీతి.  ఈ ఆలయాన్ని పల్లవ రాజైన నరసింహవర్మన్  8వ శతాబ్ధంలో నిర్మించాడు.  ఈ ఆలయాన్ని చాళక్యులు, విజయనగర రాజులు విశేషంగా అభివృధ్ధి  చేసారు.          


శ్రీవైష్ణవులకు పరమపవిత్రమైన 108 దివ్యదేశాలలో శ్రీపార్థసారధి  ఆలయం కూడా ఒకటి


ఈ ఆలయంలో శ్రీపార్థసారధి మీసాలతో దర్శనమిస్తారు. ఈ ఆలయంలో శ్రీపార్థసారధి  రుక్మిణి, సాత్యకి, సోదరుడు బలరాముడు, కుమారుడు ప్రధ్యుమ్న, మనవడు అనిరుధ్ తో దర్శనమిస్తారు. 

పార్థసారధి స్వామి అర్చారూపం  ద్విబాహువులతో కుడి చేతిలో పాంచజన్యంతో, ఎడమ హస్తం వరదహస్తంగా, పద్మంపై ఉన్న తన  శ్రీపాదాలని  చూపిస్తూ ఉంటాడు. 


శ్రీమహాలక్ష్మి యిక్కడ ఉన్న పుష్కరిణిలో భోగ్యమైన లిల్లి పుష్పంలో వేదవల్లిగా  అవతరించి, భృగు మహర్షికి దొరికిందని ప్రతీతి.              

ఇక్కడ శ్రీమహావిష్ణువు నారసింహ, కోదండరామ, రంగనాధ, గజేంద్ర వరద మరియు వరాహ స్వామిగా కొలువుదీరి  ఉన్నదు.  అండాళ్, వేదవల్లి కూడా యిదే ఆలయంలో కొలువుదీరి ఉన్నారు.                         

ఈ ఆలయంలో శ్రీపార్థసారధి స్వామి ఉత్సవమూర్తి వదనంపై శరాఘాతం గుర్తులు ఉంటాయి. కురుక్షేత్ర సంగ్రామంలో  శ్రీకృష్ణ పరమాత్మ పార్థుని రధసారధిగా ఉన్నప్పుడు, భీష్మాచార్యులు శరాఘాతాలతో శ్రీకృష్ణ పరమాత్మ వదనంపై గాయాలు చేస్తారు.  శ్రీపార్థసారధి ఉత్సవమూర్తి రుక్మిణి సత్యభామా సహితంగా కొలువుదీరి ఉన్నారు.     


తిరువళ్ళికేన్ లో కొలువుదీరిన శ్రీపార్థసారధి స్వామి వారికి బ్రహోత్సవం మరియు వైకుంఠ ఏకాదశి  విశేషంగా జరుగుతుంది. 


ఈ ఆలయంలో శ్రీపార్థసారధి స్వామిని అత్యంత భక్తిప్రపత్తులతో    కేశవాచార్య మరియు కాంతిమతి సేవించి , భగవత్ రామానుజులుని కుమారునిగా పొందారు.
                     









హరివిహముగ్ధవ ధూని కరే విలాసిని విలసతి కేళిపరే 


చందన చర్చిత నీల కళేబర పీత వతన వనమాలీ 
చందన చర్చిత నీల కళేబర పీత వతన వనమాలీ 
కేళి చలన్మని కుండల మండిత గండయు గస్మిత శాలీ 
హరివిహముగ్దవ ధూని కరే విలాసిని విలసతి కేలిపరే 
కాపి విలాసవి లోల విలోచన కేలన జనిత మనోజం 
కాపి విలాసవి లోల విలోచన కేలన జనిత మనోజం 
ధ్యయతి ముగ్ధవ బురవిభకం మధు సూధన వదన సరోజం 
ధ్యయతి ముగ్ధవ బురవిభకం మధు సూధన వదన సరోజం 
హరివిహముఘ్ధవ ధూని కరే విలాసిని విలసతి కేలిపరే 
ఇష్యతి కామపి చుంబతి కామపి రమయతి కమాపి రామ 
సథ్యతి సస్మిత చారుతరాం అపరామను గస్యతి రామ 
హరివిహముఘ్ధవ ధూని కరే విలాసిని విలసతి కేలిపరే 

8 కామెంట్‌లు:

  1. మా మీసాల సామిని మళ్ళీ చూపారు. ధన్యవాదాలు. అందమైన మూర్తి. చూసి తీరాల్సిన గుడి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మోహనాకారుని రూపం నయనమనోహరం!! ధన్యవాదాలు మైత్రేయి గారు!!

      తొలగించండి
  2. మంచి విషయాలు చెప్పారు.

    కాముధ

    రిప్లయితొలగించండి
  3. హాయ్
    మీరు మీ బ్లాగ్ ని వేరే వారి బ్లాగులు మరియు సైటులలో ప్రచారము చేయలనుకుంటే ఈ క్రింది లంకె మీద క్లిక్ చేయండి.
    http://www.adsflip.com/?r=8058

    If u join with above referal link we will get 1000 credits. This is good site. We can advertise free in other webs.

    Thanks
    niftysiri
    www.niftysiri.in

    రిప్లయితొలగించండి
  4. శ్రీ కృష్ణులవారికి మీసాలా !!

    శ్రీ రామ రాజ్యం తరువాత, బాపూగారు, బాలయ్య తో శ్రీ కృష్ణ విజయం తీస్తే, బాలయ్య మీసాలు తీయాల్సిన పని లేదన్న మాట అయితే !

    జోక్స్ అపార్ట్, ఈ దేవాలయం చాల ప్రశస్తి చెందినది. చాలా బాగా టపా రాసారండీ ఈ విషయం పై.

    (చాకొలేట్ కృష్ణా అని క్రేజీ మోహన్ డ్రామా లో , శ్రీ కృష్ణుడి వేషధారి గా క్రేజీ మోహన్ మీసాల తో కనబడతాడు. దాంట్లో, హీరో కృష్ణున్ని అడుగుతాడు, శ్రీ కృష్ణుడికి మీసాలేమిటీ అని. అందుకు శ్రీకృష్ణుడంటాడు, తిరు వళ్ళిక్కేణి దేవాలయం లో శ్రీకృష్ణుల వారిని చూడమని చెబ్తాడు )

    జిలేబి.

    రిప్లయితొలగించండి
  5. భలే భలే !! ఈ మీసాలా శ్రీకృష్ణుడే, భవిష్యత్ మీసాల శ్రీకృష్ణుల వేషాలకి ఆదర్శం.
    మీసాలా గోపాలా రా రా రారా!!
    ధన్యవాదాలు జిలేబి గారు.

    రిప్లయితొలగించండి