10, జులై 2012, మంగళవారం

శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయం భద్రాచలం

శ్రీమహావిష్ణువు సీతా లక్ష్మణ సహితంగ శ్రీరామచంద్రుడిగా భద్రాచలంలో కొలువుదీరిఉన్నారు.
అల వైకుంఠపురంబులో నగరిలో
ఆ మూల సౌధంబు దావల
మందారవనాంతరామృత నర:
ప్రాంతేందుకాంతోపలోత్సల పర్యంక
రమావినోదియగు ఆపన్నప్రసన్నుండు
విహ్వల నగేంద్రము పాహి పాహి యన
కు య్యాలించి సంరంభియై 
వైకుంఠద్వారం (ఉత్తరద్వారం)





ఆలయ ముఖద్వారం 






శ్రీరామచంద్రుడు కుడిచేతులలో పాంచజన్యం, బాణం, ఎడమచేతులలో సుదర్శన చక్రం, ధనస్సు ధరించి, వామాంకమ్మున సీతా సహితంగా, చతుర్భాహువులతో, సౌమిత్రి సహితంగా, ఆదిశేషుడు గొడుగుగా, పద్మాసీనుడై నయన మనోహరంగా దర్శనమిస్తాడు.

శ్రీసీతారామచంద్ర స్వామి  ఉత్సవ మూర్తులకి  ఆలయ ప్రాగణంలో సహస్రనామం మరియు కళ్యాణం జరుపుతారు. ఆర్జిత సహస్రనామం మరియు కళ్యాణం   లేనివాళ్ళు కూడా ఈసేవలను ప్రాంగణంలో కూర్చుని వీక్షించవచ్చు. 

క్యూ లైనులో ధ్వజస్థంభం దగ్గర భక్తులకి నుదిటిపై తిరునామంతో అలంకరిస్తారు.  

శ్రీమహాలక్ష్మి దేవి కూడా యీ ఆలయ ప్రాంగణంలో  కొలువుదీరి ఉన్నారు. 

యీ ఆలయ ప్రాంగణంలో  భద్రుని కొండను, ఆ కొండపై రామ పాదాలను దర్శించవచ్చు. 

ధ్వజస్థంభం దగ్గర ఎడమవైపున శ్రీసీతారామచంద్ర స్వామి   ఆభరణాల ప్రదర్శనశాలకు వెళ్ళటానికి టికెట్స్ యిస్తారు. 

ఇక్ష్వాకు కులతిలక ఇకనైన పలుకవే రామచంద్ర
నన్ను రక్షింప కున్నను రక్షకు లెవరింక రామచంద్ర

చుట్టు ప్రాకారములు సొంపుతో కట్టిస్తి రామచంద్ర
ఆ ప్రాకారముకు బట్టె పదివేల వరహాలు రామచంద్ర

భరతునకు చేయిస్తి పచ్చల పతకము రామచంద్ర
ఆ పతకమునకు పట్టె పదివేల వరహాలు రామచంద్ర

శత్రుఘ్నునకు చేయిస్తి బంగారు మొలతాడు రామచంద్ర
ఆ మొల త్రాటికి పట్టె మొహరీలు పదివేలు రామచంద్ర

లక్ష్మణునకు చేయిస్తి ముత్యాల పతకము రామచంద్ర
ఆ పతకమునకు పట్టె పదివేల వరహాలు రామచంద్ర

సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్ర
ఆ పతకమునకు పట్టె పదివేల వరహాలు రామచంద్ర

కలికి తురాయి నీకు మెలుకువగ చేయిస్తి రామచంద్ర
నీవు కులుకుచు తిరిగేవు ఎవరబ్బ సొమ్మని రామచంద్ర

నీ తండ్రి దశరథ మహరాజు పెట్టెనా రామచంద్ర
లేక నీ మామ జనక మహరాజు పంపెనా రామచంద్ర

అబ్బ తిట్టితినని ఆయాస పడవద్దు రామచంద్ర
ఈ దెబ్బల కోర్వక అబ్బ తిట్టితినయ్య రామచంద్ర

భక్తులందరిని పరిపాలించెడి శ్రీ రామచంద్ర
నీవు క్షేమముగ శ్రీ రామదాసుని యేలుము రామచంద్ర


మిధిలా స్టేడియం


























భద్రాచలంలో బస్సులు ఆలయం ప్రవేశ మార్గం దగ్గర ఆగుతాయి. అక్కడ నుంచి ఆటోలో ఆలయం  చేరుకోవచ్చు. ఒక్కొక్కరికి 10/- రూపాయలు తీసుకొంటారు.


వసతి కావాలనుకొంటే CRO కార్యాలయంలో సంప్రదించవచ్చు. CRO కార్యాలయంలో ఆలయం ప్రవేశ మార్గం నుంచి ఆలయానికి  వెళ్ళే దారిలో వస్తుంది. ఉచిత వసతి సదుపాయం కూడా CRO కార్యాలయంలో లోపల ఉంది. లాకర్ సౌకర్యం కూడా యిక్కడే ఉంది.లాకర్ సౌకర్యం ఉపయోగించుకోవటానికి 5/- రూపాయలు చెల్లించాలి. 200/- రూపాయలు కాషన్ డిపాజిట్ చెల్లించాలి. ఒకసారి లాకర్ తీసుకొంటే 12 గంటలు ఉపయోగించుకోవచ్చు. 

గోదావరిలో స్నానం  ఆచరించటానికి స్నాఘట్టాలు ఉన్నాయి.













రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ మామకాభీస్టదాయ మహిత మంగళం
కోశలేశాయ మందహాసదాసపోషనాయ వాసవాదివినుత సర్వరాయమంగళం
చారుకుంకుమోపేత చందనాదిచర్చితాయ హారకాశోభితాయ భూరిమంగళం
లలితరత్నకున్దలాయ తులసీవనమాలికాయ జలజసద్రుసదేహాయ చారుమంగళం
దేవకీపుత్రాయ దేవదేవోత్తమాయ చావజాతగురువరాయ భవ్యమంగళం
పుండరీకాక్షాయ పూర్నచంద్రాననాయ అండజాతవాహనాయ అతులమంగళం
విమలరూపాయ వివిధవేదాంతవేద్యాయ సుముఖచిత్తకామితాయ శుభ్రమంగళం
రామదాసాయ మృదుల హృదయకమలవాసాయ స్వామిభద్రగిరివరాయ సర్వమంగళం



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి