18, జనవరి 2012, బుధవారం

శ్రీకామాక్షి దేవి ఆలయం కాంచీపురం


కాంచీపురంలో శ్రీకామాక్షిదేవి కొలువుదీరి ఉంది. శ్రీకామాక్షిదేవిని కామాక్షి  తాయి అని   కామాక్షి  అమ్మణ్ణ్ పిలుస్తారు.  

పూర్వం ఇక్కడ ఉండే  బంగారు  కామాక్షి దేవి, ఇప్పుడు తంజావూరులో కొలువుదీరి ఉన్నారు.  కాంచీపురంలో భగవత్ శ్రీఆదిశంకరాచార్యులుచే స్థాపించబడిన కంచి కామకోటి పీఠం ఉంది. శ్రీకామాక్షిదేవి ఆలయం ప్రక్కనే కంచి కామకోటి పీఠం ఉంది.
శ్రీకామాక్షిదేవి ఆలయం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి.  కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశి  విశాలాక్షి శక్తి క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. 

ఈ దేవాలయంలో  శ్రీకామాక్షిదేవి గాయత్రి మండపంలో పద్మాసనంలో కొలువుదీరి ఉన్నారు.

"కా" అంటే "లక్ష్మి",  "మా" అంటే "సరస్వతి", "అక్షి"   అంటే "కన్ను".   కామాక్షి దేవి  అంటే లక్ష్మి దేవి మరియు సరస్వతి దేవి ని కన్నులుగా కలది.   

సోమస్కంద రూపంగా శివ (ఏకాంబరేశ్వర్) , ఉమ (కామాక్షి)  మధ్యలో స్కంధుడు (కుమారస్వామి) కొలువుదీరి ఉన్నారు. 

భగవత్ శ్రీఆదిశంకరాచార్యులు కామాక్షి అమ్మవారిని ఈ దేవాలయ ప్రాంగణం  విడిచి వెళ్ళవద్దని అభ్యర్ధించిన కారణంగా, ఉత్సవ కామాక్షి, ప్రాంగణంలోనే ఉన్న శ్రీఆదిశంకరాచార్యులు అనుమతి తీసుకొని, ఉత్సవాలకు దేవాలయ ప్రాంగణం  నుంచి బయటకు వస్తుంది.                    



ఈ కోవెల ప్రాంగణం చాలా విశాలంగా ప్రశాంత వాతావరణంలో నెలకొనిఉంది.  ఇక్కడ ప్రతిరోజూ  ప్రాతఃకాలంలో శ్రీ కామాక్షి దేవి ఉత్సవ మూర్తిని మేలుకొలిపి, ప్రాతఃకాల నైవేధ్యం సమర్పించి  హారతి ఇచ్చి, కామాక్షిదేవి ఉత్సవ మూర్తిని పల్లకిలో ప్రదక్షిణగా  లయంలోకి తీసుకొని వెళ్తారు. అక్కడ ఉన్న అందరికి ప్రసాదం పంచుతారు. ఆతర్వాత కామాక్షి దేవి కి ఎదురుగా గోపూజ  చేస్తారు. గోపృష్ట భాగం అమ్మవారి వైపు ఉంచి గోపూజ  చేస్తారు. గోపూజ అయిన తర్వాత అమ్మవారి ద్వారానికి ఉన్న తెర తొలిగించి హారతి యిస్తారు. మనం అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకోవచ్చు. 

శ్రీకామాక్షిదేవి ఆలయానికి ప్రాతఃకాలం 5 గంటలకే వెళ్తే గోపూజ చూడవచ్చు.  ఈ ఆలయంలో భగవత్ శ్రీ ఆదిశంకరాచార్యులు శ్రీకామాక్షి దేవి ముందు శ్రీ చక్రం ప్రతిష్టించారు.

శ్రీ కామాక్షి దేవి దివ్య మంగళ రూపం నయన మనోహరంగా ఉంటుంది. ఇంకా ఈ ఆలయంలో వారహి అమ్మవారు, అరూప లక్ష్మి, రూప లక్ష్మి, వినాయకుడు, కల్వనూర్(ఆది వరాహ ఫెరుమాళ్) ను దర్శనం చేసుకోవచ్చు.            
ఈ దేవాలయ ప్రాంగణంలో కుంభస్థలంపై అందంగా అలంకరించబదిన ఏనుగులను కూడా చూడవచ్చు. ఇక్కడ ఉన్న కోనేరు చాలా విశాలంగా ఉంటుంది. 

108 శ్రీ వైష్ణవ దివ్య దేశాలలో కల్వనూర్(ఆది వరాహ ఫెరుమాళ్) కూడా  ఒకటి. 
ఈ ఆలయంలో శిల్పసంపద చాలా రమణీయంగా ఉంటుంది.


ముత్తుస్వామి దీక్షితార్ ప్రవచించిన కంజదళాయతాక్షి 

కంజదళాయతాక్షి కామాక్షి
కమలా మనోహరి త్రిపుర సుందరి

కుంజర గమనే మణి మండిత మంజుళ చరణే
మామవ శివ పంజర శుకి పంకజ ముఖి
గురు గుహ రంజని దురిత భంజని నిరంజని

రాకా శశి వదనే సు రదనే
రక్షిత మదనే రత్న సదనే
శ్రీ కాంచన వసనే సు రసనే
శృంగారాశ్రయ మంద హసనే
ఏకానేకాక్షరి భువనేశ్వరి
ఏకానందామృత ఝరి భాస్వరి 
ఏకాగ్ర మనో లయకరి శ్రీకరి
ఏకామ్రేశ గృహేశ్వరి శంకరి


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి