9, జనవరి 2012, సోమవారం

శ్రీ విద్యా సరస్వతి దేవి ఆలయం వర్గల్

వర్గల్ శ్రీ విద్యా సరస్వతి దేవి కోవెల కి ప్రసిద్ధి.ఇక్కడ శ్రీ విద్యా సరస్వతి దేవి వీణాపాణి ధరించి దర్శనమిస్తారు.ఇక్కడ చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం విశేషంగా జరుగుతూ ఉంటుంది.
 
ఆలయం చాలా ప్రశాంతమైన వాతావరణం లో నెలకొని ఉంది.ఇక్కడ శనీశ్వరుడు ప్రత్యేక ఆలయంలో దర్శనమిస్తారు. శనీశ్వర స్వామికి ప్రతి శనివారం మరియు శనిత్రయోదసికి  ప్రత్యేక పూజలు జరుతాయి.


ఇక్కడ ప్రత్యేక ఆలయంలో లక్ష్మి గణపతి కొలువైయున్నారు. లక్ష్మి గణపతి ఆలయం చుట్టూ వివిధ రూపాలలో గణపతి దర్శనమిస్తారు. ప్రక్కనే ఉన్న శివాలయం లో శివుడిని దర్శించుకోవచ్చు.


వర్గల్ వెళ్ళటానికి జూబ్లి బస్ స్టాండ్ నుంచి బస్ లో వర్గల్ ఆర్చ్ వరకు వెళ్ళవచ్చు. అక్కడ నుంచి ఆటో లో శ్రీ విద్యా సరస్వతి దేవి ఆలయానికి వెళ్ళవచ్చు.  
 

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన రత్నాలయం జూబ్లి బస్ స్టాండ్ నుంచి వర్గల్ వెళ్ళే మార్గం లో వస్తుంది. 




 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి