7, జనవరి 2012, శనివారం

శ్రీనివాసా గోవిందా శ్రీవేంకటేశా గోవిందా

తిరుపతి రైలు లో చేరుకొని తిరుమల కాలినడకన వెళ్ళే వాళ్ళు లగేజి ని విష్ణు నివాసం లో డిపాజిట్ చెయ్యవచ్చు.  విష్ణు నివాసం లో 2 లగేజి డిపాజిట్ కౌంటర్స్ ఉన్నాయి. ఒకటి అలిపిరి రెండవది శ్రీవారి మెట్టు. కాలినడకన ఏ మార్గం  నుంచి వెళ్దాం అనుకొంటే, తదనుగుణంగా ఆ కౌంటర్ లో లగేజి డిపాజిట్ చేసి, విష్ణు నివాసం పక్కనే ఉన్న  దేవస్ఠానం  వారి ఉచిత బస్ ఎక్కి అలిపిరి లేక శ్రీవారి మెట్టు చేరుకొవచ్చు. దేవస్ఠానం  వారి ఉచిత బస్ ప్రతి 30 నిమిషాలకు ఒక బస్ ఉంది. 

దేవస్ఠానం  వారి ఉచిత బస్ శ్రీనివాసం, కపిల తీర్థం, అలిపిరి మరియు శ్రీనివాస మంగాపురం మీదగ శ్రీవారి మెట్టు వెళ్తుంది.    కపిల తీర్థం    మరియు శ్రీనివాస మంగాపురం వెళ్ళి దర్సనం చేసుకొందాం అనుకొంటే బస్ దిగి దర్సనం చేసుకొని తర్వాత వచ్చే బస్ లో    శ్రీవారి మెట్టు వెళ్ళవచ్చు.

లగేజి ని విష్ణు నివాసం లో డిపాజిట్ చెయ్యకపోతే, అలిపిరి లో లగేజి ని డిపాజిట్ చేసి, అలిపిరి మెట్ల మార్గం నుంచి తిరుమల వెళ్ళవచ్చు.  శ్రీవారి మెట్టు  దగ్గర లగేజి డిపాజిట్ కౌంటర్ లేదు అందుకని    శ్రీనివాస మంగాపురం లో  డిపాజిట్ చేసి, తర్వాత వచె బస్ లొ  శ్రీవారి మెట్టు  నడక మార్గం దగ్గరికి వెళ్ళవచ్చు. 

మేము అలిపిరి నడకమార్గం నుంచి తిరుమల వెళ్తే 5 గంటలు పట్టింది. దారి పొడవునా చాలా దుకాణాలు ఉన్నాయి.  అల్లం టీ   అయితే చాలా బాగుంది.  కొంచెం రణగొణ ధ్వనులు  కూడ ఎక్కువే. కాని అలిపిరి నడక దారి చలా సౌకర్యంగా ఉంది. మేము ప్రతి 50 లేక 100 మెట్లు కి విశ్రాంతి తీసుకొన్నాం. జింకల ఉద్యానవనం అహ్లాదకరంగా ఉంది.

శ్రీవారి మెట్టు నడక మార్గం నుంచి తిరుమల చేరుకోవటనికి 2 గంటలు  పట్టింది. ఇక్కడ మెట్లు చాలా తక్కువ ఉన్నాయి.   కొండ మీదకు వెళ్ళతనికి 2400 మెట్లు  ఎక్కితే  సరిపోతుంది. 1200 మెట్టు  దగ్గర దివ్య దర్సనం రసీదు ఇస్తారు. 2050  మెట్టు  దగ్గర దివ్య దర్సనం రసీదు మీదు  తనిఖి ముద్ర వేస్తారు.  ఇక్కడ దుకాణాలు చాలా తక్కువ. అక్కడక్కడ ఫ్రుటి, మినరల్ వాటర్ తప్ప ఏమీ అమ్మటం లేదు.

నాకు శ్రీవారి మెట్టు నడక మార్గం భలే నచ్చింది.  ఆడుతూ పాడుతూ తొందరగా తిరుమల చేరుకోవచ్చు.
పాప నాశనం /ఆకాశ గంగ/జాపాలి హనుమాన్/ వేణుగోపాల స్వామి గుడి :

పాప నాశనం, ఆకాశ గంగ, జాపాలి హనుమాన్ మరియు వేణుగోపాల స్వామి గుడి కి వెళ్ళటానికి టాక్షి లొ వెళ్ళ వచ్చు. దేవస్ఠానం  వారి  బస్ లో ట్రావెల్ యజ్ యు లైక్ టిక్కెట్ (24/-) తీసుకొని అన్ని చూసి రావచ్చు.ట్రావెల్ యజ్ యు లైక్ టిక్కెట్ (24/-)  పాప నాశనం  వెళ్ళే బస్ లో ఇస్తారు.     పాప నాశనం  వెళ్ళే బస్ కొండ మీద అన్ని బస్ స్టాపులలో ఆగుతుంది. ఎక్కడైన ఎక్క వచ్చు.

జాపాలి హనుమాన్ దేవాలయం వెళ్ళాలంటే కనీసం 2 కిలో మీటర్లు అయినా మెట్లు ఎక్కి వెళ్ళాలి.      

ఆకాశ గంగ చాలా బాగుంది. నీళ్ళు స్వచ్చంగా   ఉన్నాయి.          







 

 

 
 

1 కామెంట్‌: