8, జనవరి 2012, ఆదివారం

శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం అర్థగిరి


అర్థగిరి లో శ్రీ వీరాంజనేయ స్వామి కొలువై ఉన్నారు. వీరాంజనేయ స్వామి కొండమీద ఉన్నారు. రామయణ యుద్ధ సమయం లో లక్ష్మణుడు మేఘనాధుని వలన మూర్చ పోతే హనుమతుడు సంజీవనీ పర్వతం తీసుకొని ఆకాశ మార్గాన పయనించేటప్పుడు ఒక ముక్క ఇక్కడ పడుతుoది.

ఇక్కడ పుష్కరిని సంజీవరాయ పుష్కరిని అని పిలుస్తారు. ఈ పుష్కరిని లో నీరు ఔషధ గుణాలు కలిగి ఉంది. ఈ పుష్కరిని లో నీరు సేవిస్తే  అనేక వ్యాధులను  తగ్గిస్తుందని ప్రతీతి. పుష్కరినిలో నీరు ఆకుపచ్చగా ఉంటుంది. 

ఇక్కడ వినాయకుని గుడి కూడా ఉన్నది. శ్రీ రాముడు కొండమీద కొలువైయున్నాడు. శ్రీ రాముని దర్శనం చేసుకోవలంటే 600 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది.
 
అర్థగిరి ని చేరుకోవాలంటే చిత్తూరు నుంచి బస్ లో వెళ్ళవచ్చు. అక్కడ నుంచి శ్రీ వీరాంజనేయ స్వామి కోవెలకు ఆటో లో వెళ్ళవచ్చు. కాణిపాకం నుంచి చిత్తూరు బస్ లో X రోడ్ వెళ్ళి, అక్కడ నుంచి శ్రీ వీరాంజనేయ స్వామి కోవెలకు ఆటో లో వెళ్ళవచ్చు.
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి