8, జనవరి 2012, ఆదివారం

కళ్యాణ వేంకటేశ్వర ఆలయం శ్రీనివాస మంగాపురం


శ్రీనివాసుడు నారాయణవనం లో పద్మావతి ని పరిణయమాడి, శ్రీనివాసుడు పద్మావతి సమేతుడై అప్పలాయగుంట లో సిద్ద మహర్షి కి ప్రసన్న శ్రీనివాసుడు గా అభయహస్తం తో దర్శనం ఇచ్చి,     అగస్థ్య మహర్షి ఆశ్రమం ఆశీర్వచనం కోసం అగస్థ్య మహర్షి ఆశ్రమం  చేరుకొంటారు.  
 
మహర్షి  సూచన మేరకు, నూతనం వివాహమైన వాళ్ళు 6  నెలలవరకు తిరుమల కొండ ఎక్కకూడదు అని,    అగస్థ్య మహర్షి దగ్గర 6 నెలలు అతిధిగా   ఉండటానికి   శ్రీనివాడు అంగీకరిస్తాడు.
 
అగస్థ్య మహర్షి పద్మావతి శ్రీనివాసులు  ఉండటానికి అనువైన స్థలంగా శ్రీనివాస మంగాపురం గా నిర్ణయిస్తాడు. 
 
శ్రీనివాస మంగాపురం లో పద్మావతి  శ్రీనివాసులు 6 నెలలు ఉండి ఆ తర్వాత శ్రీవారి మెట్లు మార్గం నుంచి తిరుమల వెళ్తారు. ఇక్కడ శ్రీనివాసుడు కళ్యాణశ్రీనివాసుడుగా కొలువై ఉన్నాడు.







 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి