8, జనవరి 2012, ఆదివారం

ఇస్కాన్ టెంపుల్ (లోటస్ టెంపుల్)


తిరుపతి లోకి బృందావనం తెచ్చిన ఘనత మాత్రం ఇస్కాన్ టెంపుల్ ది అంటే అతిశయోక్తి కాదేమో!! నీలమేఘశ్యాముని పాలరాతి విగ్రహం చూస్తే దృష్టి మరల్చ లేనంత గా మనసు దోచుకొన్నాడు.రాధాకృష్ణుల  రూపం భలే అసమాన సౌందర్యంతో ఉట్టి పడుతున్నాయి.

మురళిమోహనుడు రాధా మరియు అష్ట సఖులతో  కొలువై ఉన్నాడు. రాధకృష్ణులు మరియు అష్టసఖుల  అలంకరణలు కొంగొత్త సొబగులు అద్దాయి. అక్కడ ఉన్న వర్ణ చిత్రాలు అపూర్వం. ప్రతి దృశ్యం ఒక వర్ణ కావ్యమే.         

ప్రతి రోజు సాయంత్రం తులసి హారతి మరియు సంధ్య హారతి ఉంటుంది. అక్కడ ఉన్నంత సేపు బాహ్య ప్రపంచాన్ని మరిచిపొయ్యాను సుమీ !!!  

ఇస్కాన్  వాళ్ళ దుకాణం మైమరిపించే రూపాలలో  కృష్ణుడు  అందంగా ముస్తాబు అయి, నేను నీతో వస్తాను నన్ను తీసుకొని వెళ్ళు అని చిరునగవుతో మనల్నే చూస్తున్నట్లు ఉన్నాడు. ఒక రూపం కంటే ఇంకో రూపం అపురూపం. కృష్ణ అంటేనే ఆనందం. భక్తి తో ఒక్క  తులసి దళం  సమర్పించినా, పరమాత్మ పరమానందాన్ని కలిగిస్తాడు.

కులశేఖర ఆళ్వార్ విరచిత ముకుంద మాల , వల్లభాచార్య విరచిత మధురాష్ఠకం , అన్నమాచార్యులు ముద్దుగారె యశోద ముంగిట ముత్యము వీడు అని కీర్తించినా, జయదేవులు అష్టపదులతో కీర్తించినా,  నీ లీలలు అనుపమానం.



అలిపిరి వెళ్ళే బస్ లు అన్ని హరేరామ హరేకృష్ణ వైపు నుంచే వెళ్తాయి.



ఇస్కాన్ టెంపుల్


కాళీయమర్థనం












కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి