30, జనవరి 2012, సోమవారం

శ్రీఅష్టభుజ పెరుమాళ్ ఆలయం కాంచీపురం


కాంచీపురంలో శ్రీమహావిష్ణువు శ్రీఅష్టభుజ పెరుమాళ్ గా కొలువుదీరి ఉన్నాడు. ఇక్కడ శ్రీఅష్టభుజ పెరుమాళ్ ఆదికేశవ పెరుమాళ్  అని కూడా ప్రతీతి.

శ్రీవైష్ణవులకు పరమపవిత్రమైన 108 దివ్యదేశాలలో,   శ్రీఅష్టభుజ పెరుమాళ్ ఆలయం కూడా ఒకటి

ఈ ఆలయం చాలా పురాతనమైనది. ఈ ఆలయంలో శ్రీమహావిష్ణువు   అష్ట భుజాలతో కొలువుదీరిఉన్నారు. కుడివైపున ఉన్న చతుర్భుజాలలో సుదర్శన చక్రం,  ఖడ్గం,  పుష్ఫం, బాణం ధరించి,  ఎడమవైపున ఉన్న చతుర్భుజాలలో      శంఖు, ధనస్సు , డాలు మరియు గధ  ధరించి నయనమనోహరంగా దర్శనమిస్తాడు. ఈ ఆలయంలో శ్రీమహాలక్ష్మి అలమేలుమంగగా కొలువుదీరి ఉంది.         

బ్రహ్మ దేవిని తపస్సుని భగ్నం చెయ్యటానికి సరస్వతీ దేవి రాక్షసులని పంపిస్తుంది. శ్రీమన్నారాయణుడు  సరస్వతీ దేవి పంపిన  రాక్షసులని సంహరిస్తాడు. కోపోద్రిక్తురాలైన  సరస్వతీ దేవి  సర్పాన్ని పంపిస్తుంది. శ్రీమన్నారాయణుడు  అష్టభుజాలతో, దివ్యాయుధాలు  ధరించి సర్పాన్ని కూడా సంహరించి బ్రహ్మ దేవిని తపస్సు నిర్విగ్నంగా కొనసాగేవిధంగా చేస్తాడు.  

ఈ ఆలయంలో శ్రీమన్నారయణుడు  సంహరించిన సర్ఫం యొక్క ఉపాలయన్ని కూడా దర్శించవచ్చు.   

ఈ ఆలయంలో కొలువుదీరిన  భూవరాహ, ఆండాళ్ మరియు హనుమని కూడా దర్శించవచ్చు. ఇక్కడ ఉన్న పుష్కరిణికి గజేంద్ర ఫుష్కరణి అని పేరు. ఈ ఆలయంలో లో వివిధ అకృతులలో  మలచిన శిల్పసంపద  కడు రమణీయం.  

ఇక్కడ  ఉన్న మరో విశేషం శ్రీఅష్టభుజ పెరుమాళ్  పరమపద ద్వారాలు నుంచి దర్శనమివ్వటం.      

2 కామెంట్‌లు:

  1. నమస్కారం అండి. నేను సందర్శించిన ప్రదేశాల విశేషాలను నా బ్లాగులో వివరిస్తున్నాను.. మీరు చూసి ఏల ఉన్నాయో తేలియచేయగలరు. నా బ్లాగు http://rajachandraphotos.blogspot.com/

    రిప్లయితొలగించండి
  2. మీ బ్లాగ్ చాలా బాగుంది. మహాబలిపురం అయితే చాలా బాగా వివరించారు.
    keep going :) :)

    రిప్లయితొలగించండి