16, జనవరి 2012, సోమవారం

పాపనాశనం తిరుమల



తిరుమల నంబి పాపనాశనం నుంచి తెచ్చిజలము తో  శ్రీవేంకటేశ్వర స్వామి వారి అర్చా మూర్తికి అభిషేకం నిర్వహించేవారు.  వయోవృధ్ధుడైన తిరుమల నంబి చాలా దూరము నుంచి  అలా కుండలో పాపనాశనం జలము తెస్తుంటే, శ్రీవేంకటేశ్వర స్వామి కలతచెంది, ఒకరోజు ఒక బాలుడు రూపంలో , తాతా!! అని తిరుమల నంబి  ని పిలిచి , దాహంగా ఉంది కుండలో  ఉన్న జలం యివ్వమని  కోరుతాడు.

అప్పుడు  తిరుమల నంబి  ఈ జలం శ్రీవేంకటేశ్వర స్వామి అభిషేకానికి తీసుకొని వెళ్తున్నాను అని యివ్వటానికి నిరాకరిస్తాడు. బాలుడు రాయిని విసిరితే, కుండకు రంధ్రంపడి జలధార వస్తుంది. బాలుడు ఆ జలధార త్రాగి దాహం తీర్చుకొంటాడు.. 

" ఎంతపని చేసావు. స్వామివారి అభిషేకానికి తీసుకొనివెళ్తున్న జలం అంతా  త్రాగేసావు"  అని తిరుమల నంబి  బాలుని తో అంటాడు.


" తాతా!! యిక్కడే ఆకాశగంగ ఉంది రా!! చూపిస్తాను. ఈరోజు నుంచి నాకు ఆకాశగంగ జలంతో అభిషేకం చెయ్యి"   అని దగ్గరగా ఉన్నఆకాశగంగను  తిరుమల నంబికి చూపించి  బాలుడు  అదృశ్యం అవుతాడు. 


" ఈ రోజు నేను కడుపు నిండా నీరు త్రాగాను. నా కడుపు చల్లగా ఉంది. ఈ రోజు నాకు అభిషేకం వద్దు"  అని శ్రీవేంకటేశ్వర స్వామి అర్చకులను ఆవహించి అని చెప్తారు.


" అభిషేకం కోసం నీరు తేసుకొని వస్తుంటే బాలుడు అన్ని  త్రాగేసాడు. ఈ రోజు అభిషేకం  చెయ్యటానికి నీరు లేదు.అభిషేకం  చెయ్యటాం ఎలా ?"  అని బెంగపడుతున్న తిరుమల నంబి శ్రీవేంకటేశ్వర స్వామి  ఆలయం లోకి  వస్తాడు. 


అక్కడ అర్చకులు చెప్పింది విని " శ్రీస్వామియే బాలుని రూపంలో  వచ్చి కుండలో నీరు త్రాగి, అభిషేకాన్ని  ఆకాశగంగా జలం తో చెయ్యమని చెప్పాడు"  అని  తిరుమల నంబి  చాలా సంతోషిస్తాడు 
    
అప్పటి నుంచి ఆకాశగంగ  జలం తో స్వామివారికి అభిషేకం  నిర్వహిస్తున్నారు.


అప్పటి నుంచి తిరుమల నంబి " తాతాచార్యుడు"  గా  కూడ పిలవబడ్డారు. 

పాపనాశనంలో దేవస్థానం వారు ఏర్పాటుచేసిన కృత్రిమ పాపనాశనం జలధార కింద స్నానం చెయ్యవచ్చు.

పాపనాశనం బస్ లో వెళ్ళవచ్చు.
 
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి