11, జులై 2012, బుధవారం

శ్రీభ్రమరాంబమల్లిఖార్జున ఆలయం శ్రీశైలం

ద్వాదశ జ్యోతిర్లింగాలలో మరియు అష్టాదశ శక్తిపీఠాలలో శ్రీశైలం ఒకటి. ద్వాదశ జ్యోతిర్లింగం మరియు అష్టాదశ శక్తిపీఠం ఒకే ప్రదేశంలో ఉన్న  ఏకైక క్షేత్రం శ్రీశైలం. 

సాక్షి గణపతి చేతిలో ఘంటం (కలం) మరియు పుస్తకంతో దర్శనమిస్తారు. సాక్షి గణపతి శ్రీశైల క్షేత్రాన్ని  దర్శించిన భక్తుల వివరాలు నమోదు చేసుకొంటారు అని ప్రతీతి. అందుకని శ్రీశైల క్షేత్రాన్ని  దర్శించిన భక్తుల సాక్షి గణపతిని కూడా దర్శిస్తారు. 














ఆదిశంకరాచార్యులు తపస్సు చేసి శివానంద లహరి మరియు సౌందర్య లహరి యీక్షేత్రంలో ప్రవచించారు.  









హటకేశ్వరం ముఖద్వారం. హటకేశ్వరం పక్కనే లలితా దేవి పీఠం ఉంది. 




శ్రీశైలే శిఖరం దృష్ట్వా | పునర్జన్మ నవిద్యతే. శ్రీశైల క్షేత్రానికి వెళ్ళిన వాళ్ళు తప్పనిసరిగా దర్శించే మరో ప్రదేశం శ్రీశైల శిఖరం. శిఖరం నుంచి నందీశ్వరుని కొమ్ముల మధ్యలో నుంచి నందీశ్వరుని పై తిలలు వేసి  శ్రీశైల శిఖరం  దర్శిస్తే పునర్జన్మ  ఉండదు అని ప్రతీతి.









ఇక్కడ కృష్ణా నదికే పాతాళగంగ అని పేరు. పాతాళగంగ దగ్గరికి వెళ్ళా లంటే చాలా మెట్లు దిగివెళ్ళాలి. రోప్ వేలో వెళ్తే వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు  ఎక్కువ మెట్లు ఎక్కి దిగనవసరం లేదు. రోప్ వే పాతాళ గంగకు వెళ్ళే మెట్ల దారిలో ఉంది. పాతాళగంగకు వెళ్ళేటప్పుడే రోప్ వే టిక్కెట్ తీసుకొంటే టూ వే టిక్కెట్  తీసుకోవచ్చు.  టూ వే టిక్కెట్ 50/- రూపాయలు. రోప్ వేలో పాతళగంగకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు రోప్ వేలో పైకి రావచ్చు. ఒన్ వే టిక్కెట్   అయితే 40/- రూపాయలు. 




పడవలో షికారుకి వెళ్ళలంటే 30/- రూపాయలు తీసుకొంటారు. 15 నిమిషాలు పాతాళగంగలో పడవలో ప్రయాణించవచ్చు. 











అక్కమహాదేవి దగ్గరికి వెళ్ళటానికి టూరిజం ప్యాకేజి ఉంది. శిఖరం, సాక్షిగణపతి, హటకేశ్వరం తదితర ప్రదేశాలు సందర్శించటానికి శ్రిశైలం బస్టాండ్ నుంచి బస్స్లులు  ఉన్నాయి. ఆటో మరియు జీపులో కూడా వెళ్ళవచ్చు.


వసతి సౌకర్యం కావాలి అంటే CRO  కార్యాలయంలో సంప్రదించవచ్చు. ఇక్కడ కులాల వారిగా సత్రాలు ఉన్నాయి. అక్కడ కూడ వసతి సౌకర్యం పొందవచ్చు.

సత్రాల నిర్వాహకులు ఉచిత అన్నప్రసాద సౌకర్యం  కల్పిస్తున్నారు. దేవస్థానం వారు ఉదయం 10 గంటలకు ఉచిత అన్నప్రసాద కూపన్లు యిస్తారు.

1 కామెంట్‌: