13, జులై 2012, శుక్రవారం

శ్రీజోగులాంబ ఆలయం ఆలంపూరు

శ్రీజోగులాంబ ఆలయం కర్నూలు కి 24 కిలోమీటర్ల దూరంలో ఉంది. అష్టాదశ శక్తి పీఠాలలో శ్రీజోగులాంబ ఆలయం కూడా ఒకటి. 


శ్రీజోగులాంబ అమ్మవారు ఉగ్రస్వరూపిణి.   శ్రీజోగులాంబ  అమ్మవారు ఆసీనురాలై,  శిరోజాలపై గబ్బిలం, బల్లి, తేలు మరియు కపాలం దర్శనమిస్తాయి.   అమ్మవారు ఉగ్రస్వరూపిణి కనుక కోనేరు పై ఆలయాన్ని నిర్మించారు.  కోనేరులో నీరు స్వచ్చంగా  ఉంది.


ఈక్షేత్రంలో పరమేశ్వరుడు బాల బ్రహ్మేశ్వర స్వామిగా కొలువుదీరి ఉన్నాడు.యిక్కడ నవ బ్రహ్మ ఆలయాలు ఉన్నాయి. అనేక ఉపాలయాలు కూడా ఉన్నాయి. 

14వ శతాబ్దంలో బహుమని సుల్థాన్స్  శ్రీజోగులాంబ   ఆలయాన్ని ధ్వంసం చేసారు. ఆప్పటినుంచి    శ్రీజోగులాంబ   అర్చా రూపాన్ని బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలోకి తరలించి అర్చిస్తున్నారు. 2005లో   శ్రీజోగులాంబ
ఆలయాన్ని పునరుద్దరించి మళ్ళీ  శ్రీజోగులాంబ   అర్చా రూపాన్ని పునఃప్రతిష్టించారు.


శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి మరియు శ్రీజోగులాంబ అమ్మవారి ఆలయాలు తుంగభద్రా నది ఒడ్డున ఉన్నాయి.  












                     

2 కామెంట్‌లు:

  1. APటూరిజం వారి టెంపుల్ టూర్ PACKAGE లో వెళ్ళాము.రాత్రిపూట గుడి మూసివేసే సమయంలో అక్కడికి చేరాము.హడావుడిగా దర్శనం చేసుకున్నాము.అమ్మవార్ని పూర్తిగా ।మీరు చెప్పినట్లుగా గమనించలేకపోయాము.చాలా అసంతృప్తిగా వెనుతిరిగాము.మీ బ్లాగు మొదటిసారిగా చూస్తున్నాను.చాలా బాగుందండీ.నెమ్మదిగా అన్ని టపాలు ।చూస్తాను.

    Typed with Panini Keypad

    రిప్లయితొలగించండి
  2. టూరిజం ప్యాకేజీ అయితే నిదానంగా దర్శనం చేసుకొనే సమయం ఉండదండి :(.
    ధన్యవాదాలు నాగరాణిగారు!!

    రిప్లయితొలగించండి