8, జనవరి 2012, ఆదివారం

పల్లి కొండేశ్వర స్వామి ఆలయం సురుటపల్లి

సురుటపల్లి లో పల్లి కొండేశ్వర స్వామి వేంచేసి ఉన్నారు. ఇక్కడ ఆది దేవుడైన పరమ శివుడు విగ్రహ రూపంలో శయనించి దర్శనమిస్తారు.



మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకిని తాడుగ, శ్రీమహావిష్ణు కూర్మ రూపం లో మందర పర్వతాన్ని  వీపు మీద మోస్తూ  , దేవతలు వాసుకి తోక వైపు , దానవులు తల వైపు ఉండి క్షీరసాగరమధనం మధనం  జరిపేటప్పుడు హాలహలం ఉధ్భవించింది. దానవులు  భోళా శంకరుడిని ప్రార్ధించగా, సర్వమంగళ అయిన పార్వతి, పరమేశ్వరుడిని హాలహలం స్వీకరించమని కోరుతుంది.  





మ్రింగెడి వాడు విభుండని
మ్రింగెడిదియు గరళ మనియు మేలని ప్రజకున్
మ్రింగుమనె సర్వ మంగళ
మంగళ సూత్రంబు నెంత మది నమ్మినదో !!


లోక కళ్యాణార్ధం హరుడు హాలహలం స్వీకరించి గరళకంఠుడు, నీలకంఠుడు అయ్యాడు. అలా  పరమ శివుడు హాలహలం స్వీకరించి వెళ్తున్నప్పుడు హాలహలం శక్తి  కి సొమ్మసిల్లి పడిపోతాడు. అప్పుడు పార్వతీ దేవి శంకరుని తల ఒడిలో కి తీసుకొని సేద తీరుస్తుంది. 



సమస్థ దేవతలు శంకరుని చూడటానికి వస్తారు. అలా శంకరుడు సొమ్మసిల్లి పడిపోతే , పార్వతీ దేవి  సేద తీర్చిన  ప్రదేశమే సురుటపల్లి.



ఇక్కడ పరమ శివుడు సర్వమంగళ అయిన పార్వతి ఒడిలో  సేదతీరుతూ శయనుంచి ఉంటాడు. సమస్థ దేవతలు  చూస్తూ ఉంతారు.



శివుడు, పార్వతి మరియు ఇతర దేవతలు ఒకే  గర్భగుడిలో  దర్శనం యిస్తారు.              



సురుటపల్లి తిరుపతికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి